హైదరాబాద్: ట్రాఫిక్ పై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు చిరు అభిమానులు నడుం బిగించారు.ఆయన అభిమానులైన ఐటీ నిపుణులు కొంత మంది 'డు ఇట్' పేరుతో నగరంలోని ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నారు. హైల్మెట్,సీట్ బెల్ట్ ఆవశ్యకతను వివరించటంతోపాటు మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల కలిగే దుష్పిరిమాణాలు వివరిస్తున్నారు.ట్రాఫిక్ నిభంధనలు పాటించే వారికి గులాబీలు,చిన్నచిన్న బహుమతులు,సర్టిఫికేట్లు ఇస్తున్నారు.