ఏలూరు: కాంగ్రేస్ పార్టీకి రాజీనామా చేసే యోచన ఇప్పట్లో లేదని,ఆ పార్టీలో కొనసాగుతూనే చిరంజీవి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నరసాపురం ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరు పార్టీ జిల్లాలో 15 స్దానాలు కైవసం చేసుకునేందుకు చిరు అభిమానాలుతో చర్చించి ప్రణాళిక సిధ్ధం చేస్తానని అన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి పార్టీకి పూర్తి స్ధాయి మెజారిటీ రాకపోయినా హంగ్ తప్పదని ఏదో ఒక పార్టీ మద్దతుతో చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.