న్యూడిల్లీ: లోక్ సభలో యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న సందర్బంగా చోటు చేసుకున్న ఓటు కోసం నోటు షుటనకు పధకం రచించింది బీజీపేనేనని భారతీయ జనతాశక్తి నాయకురాలు ఉమాభారతి శుక్రవారం ఆరోపించారు. ఈ యావత్ ఉదంతంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు,అదే పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి, కొందరు ఎంపీల హస్తం ఉన్నదని ఆమె విలేకరులతో అన్నారు.ఉమాభారతి తన వాదనను సమర్ధించుకుంటూ విలేకరులకు ఓ సిడీ ప్రదర్శించారు. ఓ బీ ఎస్పీ నాయకుడు,ఓ బీజెపీ నాయకుడు ఇంట్లో జరిగిన కార్యకలాపాలు,అనంతరం బీజీపీ ఎంపీ అశోక్ అర్గల్ ఇంటికి ఓ వ్యక్తి ఓ సంచీ తీసుకెళ్తున్న దృశ్యం ఆ సీడీలో ఉన్నాయి. తాను ఆ సీడీని లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీని కలిసి అందచేసి,దర్యాప్తు జరపించాలని కోరినట్లు తెలిపారు.