రాజమండ్రి: త్వరలో పార్టీ పెట్టనున్న చిరంజీవి కంచి పుణ్య క్షేత్రంలో చేయనున్న యాగ పూజల్లో ఉపయోగించేందుకు కూర్మావతార (తాబేలు) పీటలను తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం గొంచాలలో శిల్పులు తయారు చేస్తున్నారు. ఈ పీటలు పనస కర్రతో తయారు కానున్నాయి. ఈ పీటలను సోమవారం నాడు చిరంజీవి నివాసానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వీటిని గెద్దనాపల్లి సత్యలింగం, జోగులపాటి జోగినాదం రూపొందించారు. చిరంజీవి కుటుంబ సభ్యులు యాగ పూజలు చేసేందుకు వీలుగా ఐదు పీటలను తయారు చేశారు .