ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
హైదరాబాద్: ఎరువుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు సోమవారం రోడ్డెక్కారు. పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. వర్షాలు పడుతుండడంతో రైతులు ఎరువుల కోసం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వరంగల్ జిల్లా సంగెంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. 13 గ్రామాల రైతులు అక్కడికి చేరుకుని వ్యవసాయాధికారిని, ఎమ్మార్వోను ఘెరావ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను తీర్చే వరకు ఆందోళన సాగిస్తామని రైతులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో రైతులు వ్యవసాయశాఖ కార్యాలయంపై, సింగిల్ విండో కార్యాలయంపై దాడి చేశారు. ఆ కార్యాలయాల్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మెదక్ జిల్లాలోని సదాశివపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. ఎరువుల కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలని నవ తెలంగాణ ప్రజా పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయితీలను చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications