భారత్ వెనక్కి తగ్గదు: మన్మోహన్

అఫ్గనిస్తాన్ భద్రతకు, స్థిరత్వానికి ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదంపై ఉమ్మడిగా, స్థిరచిత్తంతో పోరాడాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఉభయ దేశాల స్నేహానికి ఉగ్రవాదం అడ్డుగోడ కావడాన్ని తాము సహించబోమని ఆయన అన్నారు. కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడిని బట్టి ఉగ్రవాద చర్యలకు సరిహద్దులు లేవనేది అర్థమవుతున్నదని ఆయన అన్నారు.
కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడిని, బెంగుళూర్, అహ్మదాబాదుల్లో బాంబు పేలుళ్లను కర్జాయ్ ఖండించారు. భారత్, అఫ్గనిస్తాన్ ఒకే విధమైన ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయని ఆయన అన్నారు. ప్రజలను రక్షించడం మన మానవులుగా మన బాధ్యత కాబట్టి ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications