బెంగళూరు: ఇది అర్జున్ భరత్ గురించి. వరల్డ్ స్కూల్స్ చాంపియన్ షిప్ లలో నాలుగో స్ధానం పొందాడు. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు. సాధారణంగా చెస్ ప్లేయర్స్ కు ఇచ్చే 2200 కంటే ఎక్కువ సాధించినవారికి ఇచ్చే మాస్టర్ అవార్డుకు అర్జు న్ అర్హత సంపాదించాడు. చెస్ చాంపియన్ షిప్ లలో కర్ణాటక ఇప్పు డు మంచి స్ధానంలో ఉంది. అండర్- 12 కేటగిరిలో ఇటీవల గిరీష్ కౌషిక్ విజయం సాధించాడు. ఇప్పుడు అర్జున్ విజయంతో బెంగళూరు ఈ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. జులై 22 నుండి 30 వరకు సింగపూర్ లో జరిగిన వరల్డ్ స్కూల్ చెస్ చాంపియన్ షిప్ లో అండర్- 9 కేటగిరిలో అర్జున్ భరత్ డబుల్ సాధించాడు. అర్జున్ గోవాకు చెందిన అనిరుధ్ భట్, తమిళనాడుకు చెందిన జెరోమ్ ఎబెంజర్ లతో కలిసి డబుల్ సాధించాడు. అర్జున్ వయసు తొమ్మిదేళ్ళు. ఇతను ఫైనల్ కు వెళ్ళడానికి ముందు నాలుగో రౌండ్ లో సింగపూర్ కు చెందిన డెరెక్ లిమ్ ను ఓడించాడు. అంతకు ముందు ఇండోనేషియాకు చెందిన మార్టినస్ ను ఓడించాడు. అర్జున్ కు ప్రఖ్యాత చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ స్పూర్తి. ఆరో ఏట నుంచి అర్జున్ తలిదండ్రుల నుంచి చెస్ పాఠాలు నేర్చుకున్నాడు. తండ్రి భరత్ విజయ్ యాహోలో స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నారు. తల్లి విద్య సాఫ్ట్ వేర్ ఇంజినీరు. తనకు స్పూర్తిగా నిలిచిన కర్ణాటక చెస్ ఆటగాళ్ళకు, అండగా నిలిచిన తలిదండ్రులకు అర్జున వందనాలు తెలిపాడు.