మెట్రో రైలు ప్రాజెక్టు పొడగింపు
హైదరాబాద్: హైదరాబాదులో తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టును నాగోల్ వరకు విస్తరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులను మైటాస్ - నవభారత్ లకు అప్పగించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. వెనకబడిన తరగతులకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.
నల్సార్ తరహాలో విశాఖపట్నం కేంద్రంగా నిజామాబాద్, విశాఖ, కడపల్లో క్యాంపస్ లు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. కేంద్రం 1992 చిట్ ఫండ్ చట్టం నిబంధనలను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పది వేల రూపాయలకు పెంచుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్స్ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ లో డిఎన్ఎ, ఫింగర్ ప్రింట్స్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు 13 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications