గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు భారీ నష్టం కలుగజేస్తున్నాయి. పశ్సిమ గోదావరి జిల్లా చాగల్లు - కొవ్వూరు రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు విరిగిపోయాయి. అయితే ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రత్నాచల్ ఎక్సుప్రెస్సుకు ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టెలిఫోన్, విద్యుత్ వ్యవస్థ జిల్లాలో పూర్తిగా దెబ్బ తిన్నది. కడెం ప్రాజెక్టుకు లక్షా 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది.
ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామంలో ముగ్గురు గోదావరి నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి కూడా వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద గోదావరి నది నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications