అమర్నాథ్ బోర్డు సభ్యుల రాజీనామా
జమ్ము: శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు సభ్యులు పది మంది బుధవారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను వారు రాష్ట్ర గవర్నర్, బోర్డ్ చీఫ్ ఎన్.ఎన్. వోహ్రాకు అందజేశారు. దీనివల్ల బోర్డును పునర్వ్యస్థీకరించే అవకాశం వోహ్రాకు ఏర్పడుతుంది. ఆలయ బోర్డుకు ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవడంతో జమ్ము అట్టుకుడుకుతున్న విషయం తెలిసిందే. నెలరోజులుగా ఈ భూవివాదంపై హింస చెలరేగుతోంది.
అమర్నాధ్ ఆలయ భూవివాదానికి పరిష్కారం కనుగొనే విషయంలో దీన్ని తొలి మెట్టుగా భావిస్తున్నారు. రాజీనామాల విషయాన్ని గవర్నర్ పరిశీలిస్తున్నట్లు బోర్డు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బోర్డులోకి ప్రముఖ వ్యక్తులను తీసుకోవడం ద్వారా ఆలయ నిర్వహణపై నమ్మకం కుదురుతుందని గవర్నర్ శ్రీ అమర్నాథ్ యాత్ర సంఘర్ష్ సమితి ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఇంతకు ముందు అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జి.డి. శర్మ, ప్రొఫెసర్ విష్ణుమూర్తి శాస్త్రి, సునీల్ సచ్ దేవ, మనోజ్ గౌర్, డాక్టర్ విమలా ధర్, ప్రొఫెసర్ నీరజ మట్టూ, రఘు మోడి, డాక్టర్ అరుణ్ కుమార్ రాజీనామాలు చేశారు.












Click it and Unblock the Notifications