వైయస్ పై చంద్రబాబు ధ్వజం
కర్నూలు: తాము అధికారంలోకి వస్తే పేదల సమస్యలన్నీ తీరుస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు మీ కోసం యాత్ర బుధవారం కర్నూలు జిల్లాలో సాగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతోందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే గ్యాస్ కొరత ఉండదని ఆయన హామీ ఇచ్చారు. ఉచితంగా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు.
శ్రీశైలం, కోయిలకుంట్లల్లో ఆయన మీ కోసం యాత్ర సాగింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన బంధువులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆయన తమ పార్టీ నాయకుడు బుడ్డా రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్లారు. చంద్రబాబు తమ ఇంటికి రావడం పట్ల బుడ్డా శైలజ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మీకోసం యాత్ర కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇందుకు కడప జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications