వరద మృతులు 13 మంది
హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల 13 మంది మరణించినట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారని పునరావాస కమీషనర్ రత్నప్రభ చెప్పారు. వరద పరిస్థితిపై, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారంనాడు సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేయాలని ఆయన వ్యవసాయశాఖ, నీటి పారుగల శాఖల అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు రత్నప్రభ చెప్పారు. వర్షాలకు ధ్వంసమైన ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications