విశాఖ మన్యంలో పేలుడు పదార్థాలు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతంలో పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు దొరికాయి. నాలుగు బస్తాల అమ్మోనియం నైట్రేట్, జిలిటెన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఇంత పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు లభించడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్ ఇంట్లో ఈ పేలుడు పదార్ధాల బస్తాలు దొరికాయి.
ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్నాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టుల కోసం ఈ పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయా, క్యారీల కోసం సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడడానికి సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications