లడ్డూకు బెయిల్ మంజూరు
విజయవాడ: విద్యార్థిని అయేషా హత్య కేసులో గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూకు బెయిల్ మంజూరు కానుంది. అయేషా హత్య కేసులో పిటి వారంట్ పై లడ్డూను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గడువులోగా ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో లడ్డూకు బెయిల్ మంజూరయ్యే అవకాశం ఏర్పడింది. బెయిల్ కోసం లడ్డూ తరఫు న్యాయవాది బుధవారం సాయంత్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
అయేషా హత్య కేసులో పోలీసులు నిర్ణీత 90 రోజుల్లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదు. తొంబై రోజుల గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో లడ్డూకు బెయిల్ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం లడ్డూ జైలులో ఉన్నాడు. విజయవాడలోని ఒక హాస్టల్ లో విద్యార్థిని అయేషా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి మంత్రి కోనేరు రంగారావు కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications