సిమి బెదిరింపు మెయిల్స్: తనిఖీలు
నల్లగొండ: తెలంగాణ జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తామని సిమి బెదిరింపు ఇ - మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో గురువారం పోలీసులు నల్లగొండ జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నల్లగొండలోని రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు నిర్వహించారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అహ్మదాబాదులో పేలిన బాంబులు భువనగిరిలోని ఒక ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీ నుంచి సరఫరా అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆకతాయి ఫోన్ కాల్స్ మీద కూడా పోలీసులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications