మల్లికా షెరావత్ పై రాఖీ నిప్పులు
ముంబయి: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ పై ఐటం గర్ల్ రాఖీ సావంత్ నిప్పులు చెరుగుతోంది. తన రాబోయే సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్న మల్లికా షెరావత్ జూమ్ చానెల్ లో రాఖీ సావంత్ షోకు అతిథిగా రావడానికి నిరాకరించింది. దీంతో రాఖీ సావంత్ మల్లికాపై మండిపడుతోంది. అవును. మల్లికా షెరావత్ నా షోకు రావడానికి నిరాకరించింది. అమీర్, షారూఖ్ వంటి నటులు నా పట్ల ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శించారు. నిరాకరించడానికి మల్లికా ఎవరు అని రాఖీ సావంత్ అంటోంది.
మల్లికా షెరావత్ ను పిలవాలనేది తన నిర్ణయం కాదని, మల్లికా తన జాబితాలో లేదని, తన నిర్మాతలు మల్లికాను సంప్రదించారని, మల్లికా నిరాకరించిందని రాఖీ సావంత్ అంటోంది. తన ముందు నిలబడడానికి మల్లికా భయపడుతోందని, అంతకన్నా మరో కారణం లేదని, ఆమెలాగా తాను మంచి డ్యాన్సర్ ను కాదని, ఆమె పెద్ద స్టార్ అి, తాను పరిశ్రమలో పేదరాలినని సావంత్ వ్యంగ్యంగా అంటోంది. తాను షారుఖ్ కాలి గోటికి కూడా సరిపోనని, అయినా అతను తనను అభిమానిస్తాడని, తన స్టార్స్ తనను కాదనరని ఆమె అన్నది. మల్లికా నిరాకరించడం వల్ల తనకేమీ ఇబ్బంది లేదని, మల్లికాకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తాను సహాయం చేస్తానని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications