రైతు బజార్లలో తక్కువ ధరకు బియ్యం
హైదరాబాద్: రాష్ట్రంలో బియ్యం ధరలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బియ్యం ధరలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10వ తేదీనుంచి రైతు బజార్లలో కిలో బియ్యాన్ని 16 రూపాయలకు, 14 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం ధరల అదుపునకు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పక్క రాష్ట్రాలకు బియ్యం తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యాపారుల వద్ద 4 వేల క్వింటాళ్లకు మించి బియ్యం నిల్వలు లేకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications