ఇడుపులపాయపైనే వైయస్ ప్రేమ: బాబు
కడప: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలో ఆస్తులు పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. చంద్రబాబు తన మీ కోసం యాత్రను శుక్రవారం కడప జిల్లాలో సాగించారు. కడప జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది ఇడుపులపాయలోనే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రజలను దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో అవినీతిదే ఇష్టారాజ్యమని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు నీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చలువేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications