బెంగుళూర్ లో మరో బాంబు పేలుడు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూర్ లో మరో సారి బాంబు పేలుడు సంభవించింది. నగరంలోని నగరబావిలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం మైసూర్ రోడ్డులో ఉంది. దాన్ని క్రూడ్ బాంబుగా భావిస్తున్నారు. అయితే క్రాకర్స్ పేలుడు అయి వుండవచ్చునని నగర పోలీసు కమీషనర్ శంకర్ బిద్రి చెప్పారు. పేలుడు కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడుతో నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయపడాల్సిన అవసరం లేదని బిద్రీ చెప్పారు. ఈ ప్రాంతంలో పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. గత నెలలో బెంగ ళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు సంభవించిన విషయం తెలిసిందే.

కర్ణాటక రాజధాని బెంగుళూర్ లో జులై 25 న ఏడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో గంటన్నర వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు జిలిటెన్ స్టిక్స్ వాడినట్లు సమాచారం. మడివాలా ప్రాంతంలో జరిగిన పేలుడులో ఒక మహిళ మరణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దాదాపు 14 మంది ఈ పేలుళ్లలో గాయపడినట్లు సమాచారం అందుతోంది. నయాందహళ్లి, మడివాలా, అడుగోడి ప్రాంతాల్లోనూ, మాల్యా ఆస్పత్రి ప్రాంతాల్లో బాంబులు పేలాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+