క్యాషియర్ వద్ద 8 లక్షల దోపిడీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా దక్కన్ గ్రామీణ బ్యాంకు క్యాషియర్ నుంచి దుండగులు పది లక్షల రూపాయలు దోచుకెళ్లారు. శుక్రవారంనాడు ఈ సంఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా రాసపల్లి శాఖకు చెందిన క్యాషియర్ డబ్బులు డ్రా చేసి కాగజ్ నగర్ కు బైక్ పై వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. గజ్జిగుడా గ్రామం వద్ద ఈ దోపిడీ జరిగింది.
తుపాకులతో బెదిరించి ఆగంతకులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఈ విషయంలో పోలీసులు ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. దోపిడీదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications