ఈ 8 సంఖ్య చైనాకు మంచిదట
న్యూఢిల్లీ: చైనాలోని బీజింగ్స్ లో శుక్రవారం సాయంత్రం ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడోత్సవాలు 8.8.08 నాడు రాత్రి 8 గంటలా 8 నిమిషాల 8 సెకన్లకు ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ సంఖ్య చైనాకు శుభసూచకమని జ్యోతిష్యులు అంటున్నారు. భారత్ కు మాత్రం ఇది అరిష్టమట. ఈ అరిష్టం అప్పుడే ఫలితం చూపిందా అని కొందరు జోక్ చేసుకుంటున్నారు కూడా. వెయిట్ లిఫ్టర్ మోనికా దేవి డోపింగ్ టెస్టులో పట్టుబడినట్లు ఆరోపణలు రావడం ఇదే కావచ్చునని అనేవారున్నారు.
బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. దేశం నుంచి 56 మంది క్రీడాకారులు ఒలింపిక్స్ క్రీడలకు వెళ్తున్నారు. వీరికి భారీ భద్రత కల్పించారు.












Click it and Unblock the Notifications