బాబు ఆస్తిలో వాటా ఇవ్వాలి: చిన్నారెడ్డి
మహబూబ్ నగర్: దత్తత తీసుకున్న హెచ్ఐవి బాధిత బాలిక లక్ష్మికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జి. చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు గురువారం మీ కోసం యాత్ర సందర్భంగా కడప జిల్లాలో లక్ష్మి అనే హెచ్ఐవి పాప లక్ష్మిని దత్తత తీసుకుని నారా లక్ష్మి అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. నారా లక్ష్మికి ఆస్తిలో సగం వాటా ఇస్తే చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందని భావించవచ్చునని, లేకుంటే ఎన్నికలు సమీపిస్తుండడంతో జిమ్మిక్కులు చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
దత్తత తీసుకుని విస్మరించడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారని, అయితే ఏమీ చేయకపోగా జిల్లాను దగా చేశారని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications