అమెరికా కంపెనీకి దుర్గా పూజ హక్కులు
కోల్ కత్తా: దుర్గా పూజా ఉత్సవాలపై కూడా కార్పోరేట్ కంపెనీల కన్ను పడింది. కోల్ కత్తాలోని దుర్గా పూజ ఉత్సవాల హక్కులను అమెరికా కంపెనీ కొనుక్కుంది. అందుకు బ్రాడ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటులను ఎంపిక చేసుకునేందుకు ఆ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ కోల్ కత్తాలోని బాదంతాలా అషర్ సంఘ పూజ ఖర్చులన్నీ అమెరికా కంపెనీ భరిస్తుంది. ఈ పూజా కార్యక్రమాల ప్రచారాన్ని మీడియాలో, వెబ్ లో చేపడుతుంది.
పూజ కమిటీ స్పాన్సరర్లను పడుతుంది. అయితే వనరులను సమీకరించుకుంటుంది. పూజా కార్యక్రమాల కోసం నిర్వాహకులు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని పిలిపిస్తున్నారు. కోల్ కత్తాతో ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా మిథున్ ను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications