కింగ్ ఫిషర్ ఫ్లయిట్ కు తప్పిన ముప్పు
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో కింగ్ ఫిషర్ విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని రన్ వేపై ఆపేశారు. విమానంలో బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఘంటా శ్రీనివాస్ లతో పాటు 65 మంది ప్రయాణికులున్నారు.
గన్నవరం నుంచి హైదరాబాదుకు ఈ విమానం బయలుదేరింది. పక్షి అడ్డురావడంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానాన్ని సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు లాంజీలో నిరీక్షిస్తున్నారు. వెంకయ్యనాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రయాణాన్ని రద్దు చేసుకుని విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. విమానం ఇప్పట్లో బయలుదేరే అవకాశం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications