విద్యుత్ కష్టాలు తొలిగినట్లే: షబ్బీర్
హైదరాబాద్: మూడు రోజుల్లో రాష్ట్రంలో విద్యుతు సరఫరా పరిస్థితి మెరుగవుతుందని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గు సరఫరా మెరుగవుతుందని, అల్మట్టి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు వచ్చే చేరే నీరు ఇదే విధంగా కొనసాగితే విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెరుగుతుందని, దాని వల్ల సరఫరా మెరుగవుతుందని ఆయన అన్నారు. విద్యుచ్ఛక్తి పరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శుక్రవారంనాడు సమీక్షించారు. సమీక్ష అనంతరం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ నీళ్లతో నిండిపోయిందని, దీంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, అందువల్ల థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా సరిగా లేక విద్యుదుత్పత్తి తగ్గిందని ఆయన చెప్పారు. ఈ రోజు నుంచి బొగ్గు సరఫరా మెరుగవుతుందని ఆయన చెప్పారు. అలాగే, రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని, ఈ దృష్ణా మూడు నాలుగు రోజుల్లో విద్యుత్ కష్టాలు తొలుగుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications