టిడిపి కుట్ర వల్లే రైతు బాధలు: రఘువీరా
హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడైనా రైతులు బాధపడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ విషప్రచారం వల్లనే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కడా లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రైతులు ప్రతిపక్షాల విషప్రచారం వల్లనే బాధపడుతున్నారని ఆయన అన్నారు. తమపై అక్కసుతోనే తెలుగుదేశం పార్టీ విషప్రచారానికి దిగిందని ఆయన అన్నారు.
తెలుగుదేశం ఇంత దిగజారుడు పార్టీ అని, పనికిమాలిన పార్టీ అని అనుకోలేదని ఆయన అన్నారు. తెలుగదేశం పార్టీ కుతంత్రాల వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు విషం కక్కాలనుకుంటే తనపైనో, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపైనో కక్కాలని, రైతుల మీద విషం కక్కడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మాదిరిగా పూటకో మాట మాట్లాడే పార్టీ కాంగ్రెస్ కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications