రిటైర్ అవుతా: సోమనాథ్ ఛటర్జీ
కోల్ కత్తా: తన పదవీ కాలం ముగిసిన తర్వాత రిటైర్ అవుతానని లోకసభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ చెప్పారు. సిపిఎంలో తిరిగి చేరే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు. సిపిఎం సభ్యుడ్ని కావడం గర్వకారణమని, తనను పార్టీ నుంచి బహిష్కరించిన రోజు తనకు అత్యంత విషాదకరమైన రోజు అని ఆయన అన్నారు. 54వ కామన్ వెల్త్ పార్లమెంట్ అసోసియేషన్ సదస్సుకు వెళ్తూ ఆయన ఈ మాటలన్నారు.
తనకు బృందావనంపై నమ్మకం లేదని, పిచ్చి గుంపులకు దూరంగా తాను తన రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి వెళ్తానని, అక్కడే తన రాజకీయ విరమణ అనంతర జీవితాన్ని గడుపుతానని ఆయన చెప్పారు. ఈ పదవీ కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగుస్తుంది. తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు తనకు విశేశమైన స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. తాను సూత్రబద్దమైన వైఖరి తీసుకున్నట్లు వారు ప్రశంసించారని ఆయన చెప్పారు. పార్లమెంటు సక్రమంగా నడవాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్పీకర్ పదవిని చేపట్టినప్పుడు పార్టీకి ఎందుకు రాజీనామా చేయలేదని అడిగితే అది ఆ సమయంలో సంప్రదాయం కాదని ఆయన అన్నారు. తాను స్పష్టమైన ఎరుకతోనే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని ఆయన చెప్పారు. స్పీకర్ గా ఎన్నికైనవారు తాత్కాలికంగా పార్టీ రాజీనామా చేసే సంప్రదాయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలిసి తాను ఏ సమయంలో కూడా ఎబిసి ఎవరినీ బలపరచడానికి ప్రయత్నించలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో తన మాజీ పార్టీ సభ్యులు అసంతృప్తి చెంది ఉంటారని, తాను విజయం సాధించానా లేదా అనేది చరిత్ర చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications