మూడో ఫ్రంట్ ఎండమావే: వెంకయ్య
గుంటూరు: దేశంలో తృతీయ ప్రత్యామయం ఎండమావేనని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం బిజెపియే అని ఆయన అన్నారు. నిన్నటి వరకు లాల్ సలామ్ అన్న ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నేడు దళాల్ సలామ్ అంటోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
కేంద్రంలో ఉన్న ముగ్గురు ఆర్థిక నిపుణులు త్రిమూర్తులు కారని ఉత్సవమూర్తులని ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, ఆర్థిక మంత్రి చిదంబరాన్ని, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ అహ్లూవాలియాను దృష్టిలో ఉంచుకుని అన్నారు. ప్రజలకు ముఖం చూపించలేక ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలను వాయిదా వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. హిందువులను కించపరచడమే సెక్యులరిజమా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications