హైదరాబాద్: జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 48లో ఆదివారం అర్ధరాత్రి దాటాక మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఆఫీసు ప్రారంభమైంది. వైద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి కుటుంబ సభ్యులు,ఆప్తుల సమక్షంలో చిరంజీవి దంపతులు పూజలు చేసి కొత్త కార్యాలయ్యాన్ని ప్రారంభించారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి,కుమారుడు రామ్ చరణ్ తేజ,అల్లు అరవింద్ దంపతులు,అల్లు అర్జున్ సన్నిహితులు, డాక్టర్ మిత్రా, కె.ఎస్.ఆర్.మూర్తి,రాజకీయ నాయుకులు చేగొండ హరిరామ జోగయ్య,కోటగిరి విధ్యాధరరావు,పలువరు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు.