ఆర్టీసీ 'సమ్మె' ప్రతిపాదన రద్దు
హైదరాబాద్: కార్మికుల డిమాండ్లులో ప్రధానమైన వాటిని యాజమన్యం అంగీకరించడంతో సమ్మె పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది.దాంతో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సోమ, మంగళవారాల్లో నిర్వహింప తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిసమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె ప్రతిపాదను విరమించుకొన్నట్టు ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు ప్రకటించారు.
కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ఆర్టీసీ ఎండీ దినేశ్ రెడ్డి అంగీకరించారు. దీని ద్వారా ఆర్టీసీలోని సుమారు 12వేల మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. తొలుత వీరిని కన్సాలిడేట్ వేతనానికి తీసుకొంటారు. ఆ తర్వాత వీరి సర్వీసులను క్రమబద్ధీకరించి ఆర్టీసీలోని ఖాళీలను వీరితో భర్తీ చేస్తారు.












Click it and Unblock the Notifications