మద్దూరు ప్రమాదం: 10 శవాల వెలికితీత
గుంటూరు: గుంటూరు జిల్లా పెద్దమద్దూరు వరద ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇప్పటి వరకు పది మృత దేహాలను వెలికి తీశారు. గుంటూరు జిల్లా మద్దూరు వాగులో లారీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు గల్లంతయ్యారు. పదకొండు మంది సురక్షితంగా బయటపడగా ఆదివారంనాడు 7 మృతదేహాలను వెలికి తీశారు. చీకటి పడడంతో ఆదివారం సాయంత్రం గాలింపు చర్యలు నిలిపేశారు.
తిరిగి సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో ఇప్పటి వరకు పది మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం అమరావతి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications