విజయవాడ: విజయవాడలోని దుర్గ గుడికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. దుర్గ గుడికి బాంబు భయం ఉన్నట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్సుకున్నారు. దుర్గ గుడికి బాంబు భయం ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ వట్టిదేనని తనిఖీల్లో తేలింది.