కమ్యూనిస్టు, తెరాస నేతల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని కూకట్ పల్లి ప్రాంతంలో వామపక్షాలు శుక్రవారం నిర్వహించిన భూపోరాటం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులును, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను అరెస్టు చేశారు. దీంతో వామపక్షాల కార్యకర్తలు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా ఈ భూపోరాటంలో పాల్గొంది. పోలీసులు తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్ ను కూడా అరెస్టు చేశారు.
ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలతో పాటు తెరాస కార్యకర్తలు కూకట్ పల్లిలోని ట్రక్ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ భూమిలో జెండాలు పాతారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వామపక్షాల నాయకులను, తెరాస ఎంపిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications