పశ్చిమ బెంగాల్ కు టాటా హెచ్చరిక
కోల్ కత్తా: హింస ఆగకపోతే తాము సింగూరు నుంచి వైదొలుగుతామని టాటా మోటార్సు చైర్మన్ రతన్ టాటా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకధరకు అమ్మతలపెట్టిన నానో కార్ల కర్మాగారాన్ని టాటా మోటార్స్ సింగూరులో స్థాపించడానికి నిశ్చయించింది. సింగూరులో హింస, ఆటంకాలు, ఉద్యోగుల భద్రత వంటి విషయాల్లో తాము ఆందోళన చెందుతున్నామని, అలాగే సింగూరులో పరికరాలకు, పెట్టుబడులకు కూడా భద్రతకు గ్యారంటీ లేదని ఆయన విలేకరులతో అన్నారు.
అవసరమైతే నానో కార్ల ఫ్యాక్టరీని మరో చోట స్థాపిస్తామని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ లో తాము ఎంతో పెట్టుబడి పెట్టామని ఆయన చెప్పారు. మరో చోటికి మారితే తమకు, వాటాదార్లకు పెద్ద వ్యయమే అవుతుందని, మరో చోటికి మార్చడం వల్ల పశ్చిమ బెంగాల్ కు కూడా ఖర్చవుతుందని ఆయన అన్నారు. దెబ్బలు తినడానికి తాను ఇక్కడికి తన ఉద్యోగులను పంపలేనని ఆయన అన్నారు. టాటా మోటార్స్ వెనక్కి తగ్గాలనే ఆలోచనకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ విమర్శించింది.












Click it and Unblock the Notifications