ఖైదీలకు భగవద్గీత: టిటిడి నిర్ణయం
తిరుపతి: రాష్ట్ర జైళ్లలోని ఖైదీలకు ఏడాదికి ఒకసారి భగవద్గీతను అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి నిర్ణయించింది. ఖైదీల్లో మానసిక ప్రవర్తన తేవడానికి భగవద్గీతను అందించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన చివరి పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఖైదీలకు ఏడాదికి ఒకసారి ఒక్కటేసి లడ్డు చొప్పున సరఫరా చేయాలని కూడా టిటిడి నిర్ణయం తీసుకుంది.
తిరుమాడ వీధిలో పాదరక్షలతో తిరగడాన్ని పాలకమండలి నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భద్రత నిమిత్తం ఆంజనేయరెడ్డి ఇచ్చిన కమిటీ నివేదిక సిఫార్సులను అధ్యయనం చేయాలని టిటిడి నిర్ణయించింది. ఈ అధ్యయనానికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శేషాద్రిని నియమించారు. అలాగే టిటిడి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించాలని కూడా టిటిడి నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications