తిరుపతి వేదికపై చిరంజీవి ఒక్కరే
తిరుపతి: ఈ నెల 26వ తేదీన తిరుపతిలోని అవిలాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే ప్రసంగిస్తారని ఆయన బావమరిది అల్లు అరవింద్ చెప్పారు. సభ ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. వాహనాల పార్కింగ్ తిరుపతి పట్టణం వెలుపలి నుంచే ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వేదిక ఏర్పాట్లను ఆదివారంనాడు చిరంజీవి సోదరుడు నాగబాబు పర్యవేక్షించారు. సభకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
చిరంజీవి అభిమానులు, ప్రజలు 12 లక్షల మంది దాకా సభకు రాగలరని అంచనా వేస్తున్నారు. రైళ్లలోనూ, బస్సుల్లోనూ తిరుపతికి చేరుకోవడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిరుపతిలోని రెస్టారెంట్లు ఇప్పటికే నిండిపోయాయి. తిరుపతి సభకు వచ్చే వారిని తిరుమలకు రానివ్వబోమని పోలీసులు చెబుతున్నారు. తిరుపతి సభకు వచ్చేవారిని అక్కడి నుంచి అటే తీసికెళ్లాలని నిర్వాహకులకు చెప్పినట్లు వారు తెలిపారు. సభకు వచ్చే వారు తిరుమలకు చేరుకోవడం మొదలు పెడితే సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనేది వారి అభిప్రాయం.












Click it and Unblock the Notifications