కలలు కనే ధైర్యం ఉండాలి: సిఎం

ఆదిలాబాద్: కలలు కనడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్య తమకు ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రిమ్స్ వైద్య కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. మారుమూల ఆదిలాబాద్ జిల్లాకు కూడా తాము వైద్య కళాశాలను తెచ్చామని, మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని ఆయన అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనని ఆయన చెప్పారు.

మత్తడి వాగు ప్రాజెక్టుకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. షాపింగ్ కాంప్లెక్సును ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ గొప్పతనాన్ని ఆయన వివరించారు. కార్పోరేట్ వైద్య సంస్థల్లో పేదలకు వైద్య సహాయం అందే ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+