మరిన్ని దాడులు చేస్తాం: ముజాహిదీన్
న్యూఢిల్లీ: భారతదేశంలో మరిన్ని దాడులు చేస్తామని ఇండియన్ ముజాహిదీన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇండియన్ ముజాహిదీన్ టీవీ చానెళ్లకు మెయిల్స్ పంపింది. అహ్మదాబాద్ పేలుళ్లకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. తర్వాతి దాడులు మహారాష్ట్ర, గుజరాత్ ల్లో చేస్తామని హెచ్చరించింది. అహ్మదాబాద్ పేలుళ్లకు వాడిన కార్ల ఫొటోలను కూడా మెయిల్ కు జత చేశారు.
పేలుళ్లలో పాల్గొన్న ఒక్క ముజాహిదీని ను కూడా ముంబయి పోలీసులు అరెస్టు చేయలేకపోయారని వ్యాఖ్యానించింది. అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల పది మంది నిందితుల్లో ముగ్గురు నిందితుల పేర్లనే సంస్థ పేర్కొంది. ముఫ్తీ అబుల్ బషార్, సాజిగ్ మన్సూరి, జాహిద్ షేక్ ల పేర్లను మెయిల్ లో పేర్కొన్నారు. సిమికి క్లీన్ చిట్ ఇవ్వడానికే ఈ మెయిల్ ను పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications