చిరుతో రెండింటికీ నష్టం: పిల్లా
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పార్టీ వల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ నష్టపోతాయని కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వర్లు అన్నారు. కాపుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన ఆదివారంనాడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. చిరంజీవి రాష్ట్ర పర్యటన ప్రారంభించిన తర్వాత ఆ ప్రభావమేమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. కాపుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించకపోతే ఆ ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.
చిరంజీవి పార్టీపై కాపు పార్టీ ముద్ర పడదని ఆయన అభిప్రాయపడదని ఆయన అన్నారు. ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు కమ్మ పార్టీగా ముద్ర పడలేదని ఆయన అన్నారు. చిరంజీవిని అన్ని కులాలవారు, అన్ని వర్గాలవారు రాజకీయాల్లోకి ఆహ్వానించారని, వారందరి మద్దతు చిరంజీవికి ఉంటుందని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ కులపార్టీగా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications