బంద్ వ్యాఖ్యలపై బుద్ధదేవ్ సారీ
కోల్ కత్తా: బంద్ లకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర సమావేశంలో బుద్ధదేవ్ తన తప్పును అంగీకరించినట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు. బంద్ లకు వ్యతిరేకంగా ప్రకటన చేసినందుకు బుద్ధదేవ్ పై సిపిఎం పోలిట్ బ్యూరో మండిపడింది. ఈ నేపథ్యంలో బుద్ధదేవ్ విచారం వ్యక్తం చేశారు.
బుద్ధదేవ్ పై చర్యకు కూడా సిపిఎం పోలిట్ బ్యూరో ఆలోచన చేసింది. ఈ విషయమై పార్టీ కేంద్ర కమిటీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బిమన్ బోస్ కు లేఖ రాసింది. వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ బిమన్ బోస్ ను ఆదేశించింది. బుద్ధదేవ్ నుంచి పార్టీ కేంద్ర కమిటీ వివరణను ఆశించింది.












Click it and Unblock the Notifications