బ్రహ్మోత్సవాలకు టెంపుల్ సిటీ తిరుపతి ముస్తాబు

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం 80,455 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 43,309 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.41 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.

మరోవంక.. శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుపతి ముస్తాబు అవుతోంది. ఈ నెల 23 నుండి 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఇందులో ఇప్పటికే గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయబద్ధంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Sri Govindaraja Swamy Temple Prepares Annual Brahmotsavams from May 23 Rejoices as Koil Alwar

సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పరిమళాలతో నిండిపోయింది.

వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నార్త్ మాడా స్ట్రీట్, కోనేటికట్ట వీధి, అలిపిరి రోడ్, ప్రకాశం రోడ్ వంటి మార్గాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తోన్నారు. విద్యుత్ దీపాలతో రూపొందించిన గోవిందరాజులు, శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిరూపాలను తిరుపతిలోని ప్రధాన కూడళ్లల్లో అమర్చుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+