IPL 2026: మలుపు తిప్పిన బుడ్డోడు.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్నందుకుంది. మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే రాజస్థాన్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
వైభవ్ విధ్వంసం..
వైభవ్ విధ్వంసం ధాటికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలోనే ఛేదించింది. 3 వికెట్లకు 225 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ధ్రువ్ జురెల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్), యశస్వి జైస్వాల్(23 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆకాష్ సింగ్, మోహ్‌సిన్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96) తృటిలో శతకం చేజార్చుకోగా.. జోష్ ఇంగ్లీస్(60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), రిషభ్ పంత్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యశ్‌రాజ్ పుంజా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.
మలుపు తిప్పిన సిక్సర పిడుగు..
221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తొలి బంతి నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్‌ను వారి నుంచి లాగేసుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.. యశస్వి జైస్వాల్‌తో కలిసి పవర్ ప్లేలోనే రాజస్థాన్‌కు 71 పరుగులు అందించాడు.
ఆకాశ్ సింగ్ వేసిన 9వ ఓవర్‌లో అయితే రెండు సిక్స్‌లు మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఔటైనా.. ధ్రువ్ జురెల్ కలిసి ఆ జోరును కొనసాగించాడు. సెంచరీ ముంగిట రనౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడినా.. అదే ఓవర్‌లో వైభవ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బుడ్డోడు ఔటైన తర్వాత మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారినా.. ధ్రువ్ జురెల్ ఏ తప్పిదం చేయకుండా మ్యాచ్‌ను ముగించాడు. వైభవ్ విధ్వంసంతోనే 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయసంగా ఛేదించగలిగింది. వైభవ్ త్వరగా ఔటై ఉంటే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమిపాలయ్యేది.












Click it and Unblock the Notifications