మళ్లీ కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ట్రంప్ సంచలన వార్నింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఫిబ్రవరి 28 నుంచి అక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టాయి. అటు ఇరాన్ సైతం ధీటుగా పోరాడుతోంది. ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు కుదుర్చేందుకు పాకిస్థాన్ యత్నించినా ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య మరోసారి భారీ యుద్ధం జరగొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చర్చలకు రాకుండా ఇరాన్ కాలయాపన చేస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. యుద్ధం జరగకూడదని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ అవసరమైతే వారికి మరోసారి భారీ దెబ్బ ఇవ్వాల్సి రావొచ్చని .. దీనిపై కచ్చితంగా చెప్పలేనని.. త్వరలో మీకు తెలుస్తుందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ది యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారిక కార్యాలయం ధ్రువీకరించింది.

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ కు ఇంకా కొంత సమయం మాత్రమే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నాయకులు అత్యంత తీవ్రవాద భావజాలం కలిగిన వారని, ఒకవేళ వారి వద్ద అణు సంబంధాలు ఉంటే వారు కచ్చితంగా వాటిని ఉపయోగిస్తారని అందుకే ఇరాన్ ను అణుశక్తి దేశంగా ఎదగనివ్వబోమని పునరుద్ఘాటించారు. అంతకుముందు ఇదే విషయంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump Issues Sensational Warning as Clouds of War Gather Once Again Major Global Alert Trump warns

ఇరాన్ పై దాడి చేయడానికి అంతా సిద్ధం చేశామని.. తాను నిర్ణయం తీసుకోబుతున్నానని ఈ మేరకు గల్ఫ్ మిత్ర దేశాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని ట్రంప్ వెల్లడించారు. అయితే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్ పై దాడిని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ కు ఇచ్చిన గడువులోపు శాంతి ఒప్పందం కుదరకపోతే క్షణాల వ్యవధిలో ఇరాన్ పై పూర్తిస్థాయిలో, భారీ ఎత్తున దాడి చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ట్రంప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+