తెలంగాణ మంత్రివర్గ భేటీలో సంచలన నిర్ణయాలు, ఇక నుంచి..!!

తెలంగాణ మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలో పలు అంశాలు చర్చకు రాగా.. హైదరాబాద్ కేంద్రంగా అనేక అంశాల పైన నిర్ణయం జరిగింది. రేపు (ఆగస్టు 15) నుంచి అమలు చేసే కొత్త పెన్షన్లు.. రేషన్ కార్డుల పంపిణీకి ఆమోద ముద్ర వేసారు. అదే సమయంలో ఈ ఏడాది హైదరాబాద్ కేంద్రం గా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ పథకాల విస్తరణ పైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. అధికారిక అజెండాతో పాటుగా పథకాల విస్తరణ పైనా చర్చ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ భేటీలో ప్రధానంగా క్యూర్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాల కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా పార్టీ కార్యాలయాకు సంబంధించిన స్థలాల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- హాల్ట్ స్టేషన్లు
ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- హాల్ట్ స్టేషన్లు
Telangana Cabinet decided to organise Telangana Raising Global summit allocates sites for Indiramma housing

కాగా..సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమిట్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే విధంగా ఇప్పటి నుంచే మంత్రులు.. అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

ఈ సదస్సు కోసం ప్రత్యేక కమిటీలను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి 'ఇన్వెస్ట్ తెలంగాణ' థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ప్రజలకు వివరించనుంది. తెలంగాణలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సు నిర్వహించనుంది.

తెలంగాణ- ఏపీ మీదుగా అరుణాచలం, నాగపట్నం కు ప్రత్యేక రైళ్లు: రూట్, షెడ్యూల్..!!
తెలంగాణ- ఏపీ మీదుగా అరుణాచలం, నాగపట్నం కు ప్రత్యేక రైళ్లు: రూట్, షెడ్యూల్..!!

వివిధ రంగాల్లో తెలంగాణ స్టార్టప్, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణల ప్రదర్శన ఏర్పాటు చేయాలని మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక.. గ్రేటర్ పరిధిలో మంత్రులు ఎక్కువగా ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా.. స్మార్ట్ రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్ల మంజూరు- పంపిణీ విషయంలోనూ ప్రతీ నియోజకవర్గంలో లబ్దిదారులకు అందే విధంగా సమన్వయం తో వ్యవహరించాలని నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+