రాగిజావ ఏ సమయంలో తీసుకుంటే ప్రయోజనం..!?
రాగిజావ మంచి పోషక పదార్థం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటం లో సహకరిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ప్రతిరోజూ రాగిజావను తీసుకోవచ్చు. అయితే దీనికంటూ ఓ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడుపడితే అప్పుడు తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజూ రాగిజావను తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పని తీరు ను మెరుగు పరుస్తుంది. కడుపులో సహజంగా వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది. అయితే, ఈ రాగి జావ ఎంత మంచిదో... తీసుకోవటంలోనూ జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
రాగిజావ ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షింయ.. పోషకాలు ఎంత గానో ఉపకరిస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి..ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరి స్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది. రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు.

రాగి జావ పరిమితంగా తీసుకుంటే ప్రయోజనం
అయితే, రాగిజావ కు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించి.. ఆ టైమ్ లో తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో కొందరికి ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మూత్రాయశయ సమస్యలు... కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యల ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపులో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే రాగిజావను తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిది. పరిమితంగా.. నిర్దేశించన సమయంలో తీసుకోవటం ద్వారా రాగిజావ ఆరోగ్యాన్ని అందిస్తుంది.













Click it and Unblock the Notifications