ఏపీలో బీసీల రిజర్వేషన్ల అమలు ఇలా- ప్రభుత్వానికి కీలక సిఫారసులు..!!
ఏపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పై వేగంగా అడుగులు వేస్తోంది. ఈ అంశం పైన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక లో కీలక అంశాలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు పై చేసిన సిఫారసుల్లో స్థానిక జనాభా ప్రకారం రిజర్వేషన్ల అమలు చేసేందు కు వీలుగా సూచనలు చేసినట్లు సమాచారం. వీటి పైన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉప సంఘం చేసే సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్ల పైన ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది.
బీసీ రిజర్వేషన్ల అమలు దిశగా కార్యాచరణ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు స్థానిక ఎన్నికల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో స్థానిక బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేసే విధంగా ప్రతిపాదనలు చేసారని సమాచారం. బీసీ రిజర్వేషన్ల అమలు వేళ ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా కీలక సూచనలు అందించినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్ దాదాపు ఏడు నెలల పాటు కసరత్తు కొనసాగించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితి మించకుండా బీసీలకు ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన ప్రతిపాదనలు చేయటంతో ప్రభుత్వం ఈ నివేదిక అధ్యయనం చేస్తోంది.

నివేదిక అధ్యయనం... కార్యాచరణ
కమిటీ చేసిన సిఫారుల పైన భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వెనుకబడిన తరగతుల జనాభాను నిర్ధారించడానికి కమిషన్ ఏకీకృత కుటుంబ సర్వే అధారంగా ముందుకు వెళ్లింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించ డానికి మండలాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ..పట్టణ స్థానిక సంస్థలకు మున్సిపల్ వార్డులు యూనిట్‌గా నిర్దారించినట్లు సమాచారం. మండల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు అనుపాతంలో సీట్లు కేటాయించిన తర్వాత, మిగిలిన సీట్లను మొత్తం 50% రిజర్వేషన్ పరిమితికి లోబడి స్థానిక బీసీ జనాభా ఆధారంగా కేటాయించేలా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మున్సిపల్ ఛైర్‌పర్సన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణలోకితీసుకోనున్నారు. కమిషన్ సమర్పించిన నివేదిక పరిశీలీలన పై ఒక మంత్రివర్గ ఉప-సంఘాన్ని ఏర్పాటు చేసి.. వారు సిఫార్సులను ఆమోదించిన తర్వాత ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. చివరగా ఈ రికమెండేషన్స్ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.













Click it and Unblock the Notifications