హైదరాబాద్ కు దగ్గరలో "హిడెన్ ఐలాండ్".. ఈ విశేషాల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

హైదరాబాద్ వాసులు నిత్యం బిజీలైఫ్ గడుపుతుంటారు. నగరంలోని ట్రాఫిక్, రద్దీ, రణగొణధ్వనుల నుంచి హాయిగా ప్రశాంతమైన వాతావరణానికి చేరుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహరించేందుకు ఇష్టపడుతుంటారు. టూర్ కోసం ఇతర రాష్ట్రాలకు మరికొంత మంది మాత్రం ఇతర దేశాలకూ వెళ్తుంటారు. కానీ హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోనే ఓ సీక్రెట్ ఐలాండ్ ఉందని మీకు తెలుసా..? ఇక్కడికి వెళ్తే అంత త్వరగా తిరిగిరావాలని అనిపించదు. మరి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది..? హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి..? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

హైదరాబాద్ వాసులకు అతి సమీపంలోనే అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ దాగి ఉంది. అదే వైజాగ్ కాలనీ.. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉన్న ఈ అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చుట్టూ ఎటు చూసినా కొండలు, ఆపైన సాగర్ బ్యాక్ వాటర్ అందాలు.. వీటిని తనివితీరా చూడాలంటే రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటుంది. సాగర్ బ్యాక్ వాటర్ మధ్యలో ఐలాండ్ కూడా నెలకొని ఉంది. తెలంగాణ గోవా అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. నల్గొండ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని వైజాగ్ కాలనీ అని పిలుస్తారు. ఈ ప్రాంతం చుట్టూ కొండలు, మధ్యలో ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో ఉంది. తెలంగాణ నుంచి 3 గంటల్లోనే ఈ పర్యాటక ప్రాంతానికి చేరుకోవచ్చు.

VizagColony a hidden island near Hyderabad you will be shocked to learn these details about it

ఈ ప్రాంతం నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉంది. ఈ ప్రాంతానికి ఓ 60 ఏళ్ల క్రితం అంటే 1950 ల నాటి కాలంలో విశాఖపట్నం ప్రాంతం నుండి పాతిక కుటుంబాలు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాయి. అలా ఆంధ్రా తీర ప్రాంతానికి గుర్తుగా ఈ ప్రాంతాన్ని వైజాగ్ కాలనీ అని పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 700 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఇక్కడి స్థానిక ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, చేపలు పట్టడం, టూరిజంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వైజాగ్ కాలనీ నుంచి కేవలం 20 నిమిషాల బోట్ జర్నీతో ఈ చిన్న ఐలాండ్ కు చేరుకోవచ్చు. ఒక్కొక్కరికీ రూ. 200 చొప్పున టికెట్ ఉంటుంది. ఒకవేళ గ్రూప్ గా వెళ్తే రూ. 1500 వరకు బోట్ ఛార్జీలు తీసుకుంటారు. ఈ ప్రాంతం హైదరాబాద్‌ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఈ సారి వీకెండ్ లో ట్రై చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+