మరో వివాదంలో నటి అనసూయ.. వక్రీకరించారంటూ పోస్ట్!

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల 'జై శ్రీరామ్' జపం చేసే కొందరి వైఖరిపై అనసూయ చేసిన కొన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. జైశ్రీరామ్‌ అనేవాళ్లలో కొందరు పెద్ద దొంగలు ఉన్నారని.. జైశ్రీరామ్‌ ముసుగులో దాడులు చేస్తున్నారని.. జైశ్రీరామ్‌ అంటేనే విలువలు ఉన్నట్లు కాదని అనసూయ పేర్కొన్నారు. నినాదాలు కాదు.. వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని ఆమె అన్నారు. సనాతన ధర్మం ముసుగులో దాడులు చేయడం కరెక్టేనా అంటూ ఆమె ప్రశ్నించారు. తాను కొలిచేది రాముడినేనని.. తన పెద్ద కొడుకుకు హనుమంతుడి పేరు పెట్టానని అనసూయ వెల్లడించారు. అనసూయ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రచ్చ ప్రారంభమైంది. అనసూయపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. హిందువులను దూషించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్!
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్!

ఈ క్రమంలో వివాదంపై అనసూయ మరో వీడియో రిలీజ్ చేసింది. తన కామెంట్ల తర్వాత దొంగలంతా బయటకు వస్తున్నారని అనసూయ వెల్లడించారు. అయితే తన కామెంట్లను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మరో పోస్టును షేర్ చేశారు.

Anasuya Bharadwaj Clarifies on Jai Shri Ram remarks Controversy Says I Am a Sanatani and Hanuman Devotee

నేనొక హిందూ సనాతనిని, హనుమాన్ భక్తురాలిని: అనసూయ
తన పోస్టులో అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. "నేను ఓ హిందూ సనాతనిని, అలాగే హనుమంతుని భక్తురాలిని. నా మతం అంటే నాకెంతో గౌరవం. సమాజంలో ఎక్కడైనా అన్యాయం లేదా తప్పు జరిగినప్పుడు స్పందించకుండా మౌనంగా ఉండటం నా స్వభావం కాదు. కానీ నేను ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో మాట్లాడానో ఆ అసలు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం విమర్శించడమే లక్ష్యంగా కొందరు ప్రచారం చేస్తున్నారు" అంటూ అనసూయ భరద్వాజ్ వాపోయారు.

Agadha First Review: ఒళ్లు గగుర్పొడితే మిస్టికల్ హార్రర్ థ్రిల్లర్..!
Agadha First Review: ఒళ్లు గగుర్పొడితే మిస్టికల్ హార్రర్ థ్రిల్లర్..!

ఎడిటెడ్ వీడియోల వలలో పడొద్దు.. అనసూయ సూచన
తనపై నమ్మకం, అభిమానం ఉన్నవారు ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని అనసూయ కోరారు. "సగం సగం మాటలు ఉన్న స్టేట్మెంట్లు, ఎడిట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌లను చూసి ఎవరూ మోసపోవద్దు. నా కామెంట్స్ వెనుక ఉన్న పూర్తి సత్యాన్ని అర్థం చేసుకోవాలి" అని అభిమానులకు, నెటిజన్లకు అనసూయ సూచించారు. వివాదాలు ఎన్ని వచ్చినా తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే అనసూయ.. ఈ పోస్ట్ తో తనపై వస్తున్న ట్రోలింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+