అమెరికా యుద్ధం వేళ.. భారత్ రానున్న ఇరాన్ అధ్యక్షుడు: ప్రధాని మోదీతో ముఖాముఖి భేటీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు తగ్గట్లేదు. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు- ప్రతిదాడులు కొనసాగుతూనే వస్తోన్నాయి. హార్ముజ్ జలసంధి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెర పడట్లేదు. రెండు దేశాలూ భీష్మించుకు కూర్చున్నాయి దీని విషయంలో. అమెరికా తన వైమానిక దాడులను తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించినా ఇరాన్‌ వెనక్కి తగ్గట్లేదు. ఇజ్రాయెల్ కూ ధీటుగా బదలిస్తూ వస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారత పర్యటనకు రాబోతోన్నారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరగబోయే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన స్వయంగా పాల్గొనబోతోన్నారు. ఇందులో సైడ్ లైన్స్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి భేటీ కానున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ దేశాధినేత భారత పర్యటనకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Iranian President Masoud Pezeshkian set to Visit India for BRICS Summit in September West Asia Tens

ఈ విడత బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది బ్రెజిల్ లో జరిగిన భేటీ అనంతరం ఈ సమ్మిట్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించింది.. భారత్. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్ పై ఈ సదస్సును నిర్వహించనుంది. భారత్, చైనా, బ్రెజిల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఇందులో సభ్యత్వం ఉంది.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు ఇచ్చిన మాట తప్పని డొనాల్డ్ ట్రంప్: ఇరాన్ పై..!!
సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు ఇచ్చిన మాట తప్పని డొనాల్డ్ ట్రంప్: ఇరాన్ పై..!!

దీంతో ఇరాన్ తరఫున పెజాష్కియన్ స్వయంగా ఇందులో పాల్గొననున్నారు. ఈ పర్యటన.. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్న భారత్.. దౌత్యపరంగా నాయకత్వం వహించగలదని ఇరాన్ విశ్వసిస్తోంది. జూన్ లో ఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల భేటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇందులో పాల్గొన్నారు.

ఈ సారి ఎవ్వరు చెప్పినా వినే ప్రసక్తే లేదు: భారత్‌కు పాకిస్తాన్ ప్రధాని హెచ్చరికలు
ఈ సారి ఎవ్వరు చెప్పినా వినే ప్రసక్తే లేదు: భారత్‌కు పాకిస్తాన్ ప్రధాని హెచ్చరికలు

ఈ సంక్షోభ నివారణ కోసం భారత్ చేపట్టే ఎలాంటి నిర్మాణాత్మక శాంతి చర్చలనైనా తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. పెజాష్కియన్ భారత పర్యటనను ఆయన ధృవీకరించారు. బ్రిక్స్ సమ్మిట్ లో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా- ఇజ్రాయెల్ వైఖరిని ఆయన ప్రస్తావిస్తారని, ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+