Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..!
పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినో (El Nino)పరిస్ధితుల కారణంగా వర్షాలు లేక అల్లాడుతున్న ప్రజలకు ఇవాళ ఓ గుడ్ న్యూస్ అందింది. ఎల్ నినో ప్రభావం త్వరలో పూర్తిస్దాయిలో కనిపిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, అంతకంటే ముందే కురవాల్సిన వర్షాలన్నీ ఈ నెలలోనే కురవబోతున్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడించాయి. బంగాళాఖాతంలో ఇప్పటికే (Bay of Bengal) గర్జన మొదలైందని, ఇది ఆగస్టు నెలలో వరుసగా అల్పపీడనాలకు కారణమవుతుందని అవి అంచనా వేస్తున్నాయి.
ఎల్ నినో కారణంగా ఇప్పటికే భారత్ లో రుతుపవనాలు (Monsoon)ప్రవేశించినా ముందుకు సాగకుండా చెల్లాచెదురైపోయాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో మారుతున్న పరిస్ధితుల కారణంగా అవి తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వరుస అల్పపీడనాలతో రుతుపవనాలకు మంచి ఊతం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ వర్షపాత అంచనాల ప్రకారం రాబోయే 15 రోజుల్లో దేశంలోని మధ్య, తూర్పు, ఉత్తర ప్రాంతాలలో విస్తారంగా, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దేశంలోని ప్రధాన రుతుపవన ప్రాంతంలో ఎలాంటి భారీ విరామ దశ ఏర్పడే సూచనలు లేనందున, ఈ అంచనా ప్రత్యేకంగా ప్రోత్సాహకరంగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రుతుపవనాల వర్ష కర్మాగారంగా పిలిచే బంగాళాఖాతం, అసాధారణంగా చురుకుగా ఉంటుందని అంచనా వేశారు. ఇది ఒకదాని తర్వాత ఒకటిగా అనేక అల్పపీడన వ్యవస్థలు ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుందని అంచనా. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు భారీ మొత్తంలో తేమను తీసుకురావచ్చని అంచనా. దీంతో ఆగస్టు చివరి వారాల వరకు కూడా వర్షాలు కురిపించే వ్యవస్థలు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా.














Click it and Unblock the Notifications